ఆండీ ముర్రేకు షాక్.. లియాండర్ పేస్‌కు శుభారంభం

ఆదివారం, 22 జనవరి 2017 (15:13 IST)
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్ టోర్నీలో పెను సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్‌ వన్ ఆటగాడు ఆండీ ముర్రేకి జర్మనీ ఆటగాడు షాక్ ఇచ్చాడు. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లో జర్మనీ ఆటగాడు మిషా జెరెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-7, 7-5, 2-6, 4-6 తేడాతో ముర్రే ఓటమి పాలయ్యాడు.
 
అలాగే, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలిరౌండ్‌లో లియాండర్‌ పేస్‌.. మార్టినా హింగిస్‌ జోడీ విజయం సాధించింది. పోల్‌మన్స్‌(ఆస్ట్రేలియా).. అయివా(ఆస్ట్రేలియా)పై పేస్‌ జోడీ వరుస సెట్లలో 6-4.. 6-3 తేడాతో గెలుపొందింది. 
 

వెబ్దునియా పై చదవండి