జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు తైక్వాండో క్రీడాకారిణులు ఢిల్లీలో శిక్షణ పొందుతున్నరు. తొలుత 9వ తరగతి క్రీడాకారిణికి శిక్షణ ఇచ్చే కోచ్ ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఆ బాలిక కోచ్ ఇంటికి వెళ్లగా మత్తు మందు కలపిన పానీయం ఇచ్చి అత్యాచారం జరిపాడు. స్పృహలోకి వచ్చాక దీనిపై ప్రశ్నిస్తే క్రీడాకారిణి అభ్యంతరకరంగా ఉన్న అశ్లీల చిత్రాలు, వీడియో చూపి దీనిపై ఫిర్యాదు చేస్తే వీటిని బయటపెడతానని కోచ్ బెదిరించాడు. దీంతో ఆ సమయంలో మిన్నకుండివున్న ఆ బాలిక.. ఆ తర్వాత పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనకు భోజనంలో మత్తుమందు కలిపి పెట్టి తనపై కూడా కోచ్ అత్యాచారం జరిపాడని మరో క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు క్రీడాకారిణుల ఫిర్యాదుపై తాము దర్యాప్తు చేపట్టామని ఢిల్లీ డీసీపీ మణదీప్ రాంధ్వా చెప్పారు. కోచ్ తమపై అత్యాచారం చేయడమే కాకుండా తమ అశ్లీల చిత్రాలు, వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఎనిమిదేళ్లుగా తమపై అత్యాచారం చేస్తున్నాడని బాధిత క్రీడాకారిణులు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.