భారత్ ఆటగాళ్లు సాధించిన మొత్తం పతకాల్లో నాలుగు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా, టోక్యో పారాలింపిక్స్ ఆదివారంతో ముగియనున్నాయి. చివరి రోజు భారత అథ్లెట్లు.. మరో మూడు పతకాల కోసం పోటీ పడనున్నారు.
ఇదిలావుంటే, విశ్వక్రీడల్లో మనదేశం తరపున స్వర్ణం సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన అవని.. టోక్యో పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనుంది. ఆదివారం జరుగనున్న కార్యక్రమంలో అవని త్రివర్ణ పతాకాన్ని చేబూని ముందు నడవనుండగా భారత్ నుంచి 11 మంది ఇందులో పాల్గొననున్నారు....