కొత్త సంవత్సరం సందర్భంగా సెలెబ్రిటీలు పండగ చేసుకుంటున్నారు. పెళ్లికాని సెలెబ్రిటీలు సైతం తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఫోటోలు పెడుతున్నారు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా నటాషాల ప్రేమాయణం కొత్త సంవత్సరం సందర్భంగా వెలుగులోకి వచ్చింది. అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా కూడా తన ప్రేమాయణాన్ని బహిర్గతం చేసింది.
విశాల్ గుత్తా జ్వాలకు ముద్దు పెడుతున్న ఫోటోను చూసి.. చాలామంది నెటిజెన్స్ వీరు ప్రేమాయణంలో ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే విష్ణు భార్యకు విడాకులు ఇచ్చింది ఇందుకేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కొత్త సంవత్సర వేళ గుత్తా జ్వాల పోస్ట్ చేసిన ఫోటోల్లో వీరి జోడి చాలా బాగుందంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.