"చైనీస్ నూతన సంవత్సరం రోజున అమ్మమ్మ మరణించింది. ప్రతి నెలా అమ్మ చైనాకు వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. కోవిడ్ కారణంగా ఈ ఏడాది అమ్మ వెళ్లలేదు" అంటూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలా జ్వాలా ట్విట్టర్‌లో తన అమ్మమ్మకు శ్రద్దాంజలి తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు.
''చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావు" అంటూ జ్వాలను ప్రశ్నించాడు. ఈ కామెంట్‌పై స్పందించిన జ్వాలా ఆవేదన వ్యక్తం చేసింది. " ఓపక్క అమ్మమ్మను పోయిన బాధలో తాముంటే ఇలా జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధగా అనిపిస్తోంది. "మనం ఏ సమాజంలో బతుకుతున్నాం.. మానవీయత ఉందా.. మనం ఎటువైపు పయనిస్తున్నాం.. ఇది సిగ్గుపడాల్సిన విషయం" అంటూ ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.