కొబ్బరినూనెతో కంచుదీపం వెలిగించండి

WD
ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముడిని నిష్ఠతో పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి రోజున శ్రీరాముడిని ప్రార్థించి రెండు లేదా ఐదు వత్తులతో, కొబ్బరినూనె పోసి కంచుదీపము వెలిగిస్తే ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.

శ్రీరామ నవమి రోజున శుచిగా స్నానమాచరించి, పూజగదిని, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు పూజగదిలో సీతారామలక్ష్మణ సమేత ఫోటోను లేదా, శ్రీరామ ప్రతిమను సన్నజాతులు, తామర పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత ఆవునేతితో శ్రీరామునికి పంచహారతులివ్వాలి. పంచహారతులిచ్చాక స్వామివారికి కమలాకాయలు, వడపప్పు నైవేద్యంగా పెట్టాలి.

స్త్రీలు నుదుట కుంకుమ పెట్టుకుని, శ్రీరాముని పటము ముందు 108 సార్లు శ్రీరామ మంత్రాన్ని ఉచ్చరిస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. దేవాలయాల్లో శ్రీరామనవమి రోజున రామస్వామికి పంచామృతముతో అభిషేకం చేయించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి