సీతారాముల చరితం... వీడియో

దుష్టశిక్షణ-శిష్టరక్షణార్థం చైత్ర శుద్ద నవమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు, పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కాటక లగ్నంలో పగటి పూట సాక్షాత్తు మహావిష్ణువే కౌసల్యాదేవీ పుత్రుడైన శ్రీరామచంద్రులువారు ఈ భూమిపైన జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజునే "శ్రీరామ నవమి"గా జరుపుకుంటున్నారని పండితులు అంటున్నారు.

"రామ" అంటే రమించడం అని అర్థమని, అందుచేత ఎల్లప్పుడూ మన హృదయములో వెలుగొందుతున్న ఆ పరమాత్ముని స్మరిస్తూ ఉండాలని పండితులు చెబుతున్నారు. అగ్నిని తాకితే ఎలా అది మనల్ని దహిస్తుందో, అదేవిధంగా శ్రీరామధ్యానముతో మన పాపాలన్నీ దహించివేయబడతాయని పురోహితులు వెల్లడిస్తున్నారు.

అందుచేత శ్రీరామ నవమి రోజున రామ పరమాత్మను మనసారా కొలిచే వారికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని, అరిష్టాలు, ఈతిబాధలు, పాపాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ఇంకా శ్రీరామ నవమి నాడు సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని దర్శించుకోవడంతో కోటి జన్మల పుణ్య ఫలాన్ని పొందవచ్చునని విశ్వాసం.

వెబ్దునియా పై చదవండి