శ్రీరామనవమి రోజున కొబ్బరినూనెతో దీపమెలిగిస్తే?

శుక్రవారం, 27 మార్చి 2015 (12:59 IST)
శ్రీరామనవమి రోజున పండుగ వాతావరణం నెలకొంటుంది. గ్రామాల్లోనూ, పట్టణాల్లో సంబరాలు మొదలవుతాయి. రామాలయాలకు కల్యాణ శోభ ఉట్టిపడుతుంది. అలాంటి శ్రీరామనవమి రోజున పూజకు ఏ నూనె  ఉపయోగించాలనే సందేహం మీలో ఉందా.. ? అయితే ఈ స్టోరీ చదవండి.

రాముడు చైత్రశుద్ధ నవమి రోజున .. పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఉగాది నుంచి ఆరంభమయ్యే వసంతనవరాత్రుల్లో రామచంద్రుడిని పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో రామాయణ పారాయణం ... రామకథా గానం విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఇక నవమి రోజున మధ్యాహ్నం సమయంలో అన్ని క్షేత్రాల్లోను స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 
 
శ్రీరామనవమి పూజామందిరంలో సీతారాముల ప్రతిమలను ఏర్పాటు చేసుకుని ఆరాధించేవాళ్లు ఎంతోమంది వుంటారు. అయితే ఈ రోజున స్వామివారి సన్నిధిలో కొబ్బరినూనెతో దీపారాధాన చేయడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఎందుకంటే ఆయా పర్వదినాలలో దీపారాధనకి ఉపయోగించే తైలం కూడా విశేషాన్ని సంతరించుకుని వుంటుంది. 
 
ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజున దీపారాధనకి 'కొబ్బరి నూనె' ఉపయోగించాలని పండితులు అంటున్నారు. ఈ రోజున పూజామందిరానికి రెండు వైపులా కొబ్బరినూనెతో గల దీపపు కుందులు వుంచి .. ఐదేసి వత్తుల చొప్పున కుందుల్లో వేసి వెలిగించ వలసి వుంటుంది. శ్రీరామనవమి రోజున ఇలా కొబ్బరినూనెతో దీపారాధన చేయడం వలన, విశేషమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి