కొబ్బరితో అటుకుల పాయసం ఎలా చేయాలి!?

FILE
కావల్సిన పదార్థాలు:

అటుకులు - రెండు కప్పులు, నెయ్యి - నాలుగు చెంచాలు, కొబ్బరి తురుము - రెండు కప్పులు, సెనగపప్పు - అరకప్పు, బెల్లం తురుము - కప్పు, కుంకుమ పువ్వు - కొద్దిగా, యాలకులపొడి - చెంచా, లవంగాలు - ఐదు, ఎండుద్రాక్ష - రెండు చెంచాలు, జీడిపప్పు - పది.

తయారీ విధానం:
అటుకులను వస్త్రంలో వేసి జల్లించినట్లు చేస్తే... వాటిలో ఉన్న దుమ్ము, చెత్త పోతాయి. ఇప్పుడు బాణలిలో కాస్త నెయ్యి వేసి అటుకుల్ని వేయించాలి. అలానే జీడిపప్పు, ఎండుద్రాక్ష, లవంగాలను వేయించి పెట్టుకోవాలి. కొబ్బరి తురుమును మిక్సీలో వేసి చిక్కని పాలు తీసుకోవాలి. అందులో అటుకులను నానబెట్టి పక్కన పెట్టాలి.

తరవాత గిన్నెలో నీళ్లు పోసి సెనగ పప్పు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. పప్పు ఉడికాక పాలతో సహా అటుకులు, బెల్లంతురుము, కుంకుమపువ్వు రేకలు ఒకదాని తరువాత ఒకటి వేసి... సన్నటి మంటపై ఉంచాలి.

మిశ్రమం దగ్గరపడుతున్నప్పుడు యాలకులపొడి...వేయించిన లవంగాలు చేర్చాలి. ఐదు నిమిషాలయ్యాక దింపేసి ఎండుద్రాక్ష, జీడిపప్పుతో అలంకరిస్తే కొబ్బరి అటుకుల పాయసం సిద్ధమయినట్టే.

వెబ్దునియా పై చదవండి