కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము - కప్పు, పాలు - కప్పు, పంచదార - అరకప్పు, ఏలకులు - 4, నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు, బాదం పలుకులు - ఒక టేబుల్ స్పూను, జీడిపప్పు - ఒక టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం: బాణలిలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేడిచేసి, అందులో బాదం పలుకులు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. వేగినదానిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే నేతిలో బీట్రూట్ తురుము వేసి రెండు నిముషాలు వేయించాలి. వేగిన బీట్రూట్లో కాచి చల్లార్చిన పాలు పోసి, ఇంకిపోయే దాకా ఉడికించాలి. ఏలకులపొడి, పంచదార వేసి దగ్గరపడే వరకు కలుపుతూ ఉండాలి. మిగిలిన నెయ్యి, వేయించిన బాదం పలుకులు, జీడిపప్పులు వేసి దించేయాలి.