కావలసిన పదార్థాలు : సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు... ఒక కప్పు పాలు.. ఒక కప్పు జీడిపప్పు.. 15 గ్రా. పంచదార.. ఒక కప్పు పచ్చికోవా.. ఒక కప్పు బాదంపొడి.. అర కప్పు యాలక్కాయలపొడి.. ఒక టీ. నెయ్యి.. తగినంత
తయారీ విధానం : ముందుగా నేతిలో జీడిపపప్పు వేయించుకోవాలి. తరువాత పాలు మరిగించాలి. దాంట్లో పచ్చికోవాతో పాటు పంచదార కూడా వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం బాగా మరుగుతుండగా యాపిల్ ముక్కల్ని వేసి కలియబెట్టాలి. కాసేపు అలాగే ఉడికిన తరువాత బాదంపొడి వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.
ఈ మిశ్రమం బాగా దగ్గరయ్యేంతదాకా స్టవ్‌పై అలాగే ఉంచి గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరగా అందులో తగినంత నెయ్యి, యాలకుల పొడి వేసి కలియబెట్టి దించేయాలి. అంతే యాపిల్ కోవా తయారైనట్లే..! వెరైటీగా రుచిగా ఉండే ఈ యాపిల్ కోవాను చిన్నపిల్లలతోపాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా..!!