కావలసిన పదార్థాలు : నెయ్యి... వంద గ్రా. మైదాపిండి... ఒక కేజీ బియ్యంపిండి... 120 గ్రా. ఉప్పు... పావు టీ. పంచదార పొడి... 700 గ్రా. యాలకులపొడి... 40 గ్రా. మిఠాయి రంగు... కాస్తంత నూనె... సరిపడా
తయారీ విధానం : మైదా, ఉప్పు, కరిగించిన నెయ్యిని ఒక పాత్రలో వేసి కలపాలి. తరువాత సరిపడా నీళ్లతో ముద్దగా చపాతీపిండిలా కలపాలి (రంగు కావాలనుకునేవాళ్లు ఈ నీళ్లలోనే కలపాలి). ముద్దగా కలిపిన పిండిని దళసరి చపాతీలా వత్తాలి. ఆపై బియ్యప్పిండిలో కొంచెం నెయ్యి కలిపి చేసిన చపాతీమీద అద్దాలి. ఇప్పుడు ఈ చపాతీని చాపలా ఒక వైపు నుంచి చుట్టాలి.
తరువాత దీన్ని 2 అంగుళాల మందంగల ముక్కలుగా కోసి ఒక్కో ముక్కను పొరలు బయటకు వచ్చేలా గుండ్రంగా ఒత్తి, వాటిని కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించాలి. వేడిగా ఉండగానే పంచదార, యాలకులపొడి చల్లి, చల్లారిన తరవాత సర్వ్ చేయాలి.