నోరూరించే "పేణి పాక్‌ స్వీట్"

కావలసిన పదార్థాలు :
పేణి (సన్నని సేమ్యా... పావుకిలో
మైదా... 50గ్రా.
నెయ్యి... 250గ్రా.
పంచదార... ఒకటిన్నర కిలోలు
యాలకులపొడి... అరటీస్పూను
పాలపొడి... 150గ్రా.

తయారీ విధానం :
పంచదారను ఓ బాణలిలో వేసి 2 గ్లాసుల నీళ్లు పోసి పాకం పట్టాలి. పంచదార కరిగి సన్నని తీగపాకం రాగానే మైదా, పాలపొడి వేసి ఉండలు లేకుండా కలపాలి. తరవాత 100 గ్రాముల పాకంలో పోయాలి. పాకం, పిండి రెండూ బాగా కలిసిన వెంటనే, మిగతా నెయ్యి కొంచెం కొంచెంగా కలపాలి. ఆపై పేణి కూడా చేర్చి పూర్తిగా కలిసేలా చేసి దించాలి. ఇప్పుడు నెయ్యి పూసిన ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి చల్లారాక ముక్కలుగా కోస్తే తియ్య తియ్యని పేణి పాక్‌ స్వీట్ రెడీ అయినట్లే...!

వెబ్దునియా పై చదవండి