పెసరపప్పు బెల్లంతో "కొబ్బరి బూరెలు"

FILE
కావలసిన పదార్థాలు :
వేయించిన పెసరపప్పు... ముప్పావు కిలో
బెల్లం... ఒక కేజీ
ఎండు కొబ్బరి... పావుకిలో
అటుకుల పొడి... పావుకిలో
యాలకుల పొడి... ఒక స్పూను
నెయ్యి... సరిపడా
నూనె... సరిపడా

తయారీ విధానం :
ముందుగా పెసర పప్పును మిక్సీలో వేసి రవ్వలా తయారు చేసుకోవాలి. ఆ తరువాత బెల్లానికి సరిపడా నీళ్లు పోసి యాలకుల పొడి వేసి తీగపాకం వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత అందులో నెయ్యి, అటుకుల పొడి, కొబ్బరి పొడి, పెసర రవ్వను పోసి గట్టిగా వచ్చే వరకూ కలపాలి.

ఇలా తయారు చేసిన దానిని చిన్నచిన్న ముద్దలుగా చేసి గుండ్రంగా బిళ్లలుగా వత్తుకోవాలి. వీటిని మరుగుతున్న నూనెలో వేసి దోరగా వేయించి తీసి డబ్బాలో భద్రపరచుకోవాలి. అంతే... కొబ్బరి బూరెలు రెడీ. మీరు కూడా ప్రయత్నిస్తారు కదూ...!

వెబ్దునియా పై చదవండి