కావలసిన పదార్థాలు : గోధుమరవ్వ.. ఒక కప్పు నెయ్యి.. రెండు టీ. బెల్లం.. అర కప్పు బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష.. అర కప్ప చొప్పున నూనె.. సరిపడా గసగసాలు లేదా నువ్వులు.. అలంకరణకు సరిపడా
తయారీ విధానం : గోధుమరవ్వలో నెయ్యి వేసి, నీళ్లు పోస్తూ గట్టిగా కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసి వేయించుకోవాలి. అవి చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి చేయాలి. పొయ్యి మీద ఒక పాత్రలో మిగిలిన నెయ్యిని వేడి చేసి, అందులో బెల్లం తురుమును వేసి కరగనివ్వాలి. దానికి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా జతచేయాలి.
ఐదు నిమిషాలు అలాగే ఉడికిన తరువాత అందులో ముందుగా పొడి చేసి పెట్టుకున్న గోధుమ ఉండల పొడిని కలపాలి. ఉండలు కట్టకుండా బాగా కలిసేలా కలియబెట్టిన తరువాత కిందికి దించేయాలి. కాస్త ఆరిన తరువాత కావాల్సిన సైజులో ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసి.. అలంకరణకు నువ్వులు లేదా గసగసాలలో అద్దితే... ఇక నోరూరించే ఆటా లడ్డు తినటమే తరువాయి...!