కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు.. అర కేజీ చక్కెర.. పావు కేజీ నెయ్యి.. 200 గ్రా. యాలక్కాయల పొడి.. రెండు టీ.
తయారీ విధానం : బంగాళాదుంపలను కుక్కర్లో ఉడికించి, తొక్కతీసి మెత్తగా మెదపాలి. కాగుతున్న నెయ్యిలో ఈ ముద్దను వేసి గోధుమరంగు వచ్చేంతదాకా వేయించాలి. దాంట్లోనే చక్కెర పోసి బాగా కలియబెట్టి సన్నటి మంటమీద ఉడికించి నీరు ఇంకిపోయి ముద్దగా అయ్యేంతదాకా ఉంచాలి. చివర్లో యాలక్కాయలపొడి వేసి దించేయాలి. అంతే బంగాళాదుంపల సరా తయార్..! వేడిగా ఉన్నప్పుడే ఈ సరాను కప్పులలో వేసి స్పూన్ వేసి సర్వ్ చేయాలి.