బాదం పిస్తాల రుచులతో "మాల్‌పురా"

FILE
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ... ఒక కప్పు
మైదా... ఒక కప్పు
పాలు... నాలుగు కప్పులు
పంచదార... ఒకటిన్నర కప్పు
మంచినీళ్లు... ఒక కప్పు
ఎసెన్స్... మూడు చుక్కలు
బాదం, పిస్తాపప్పు... సరిపడా
నూనె... సరిపడా

తయారీ విధానం:
మైదా, బొంబాయి రవ్వల్ని బాగా కలిపి అందులో పాలు పోసి పూరీ పిండిలా కలపాలి. ఈ పిండిముద్దను ఫ్రిజ్‌లోగానీ తడిబట్ట కప్పిగానీ పది నిమిషాలపాటు ఉంచాలి. స్టవ్‌మీద పాత్ర పెట్టి పంచదార, నీళ్లు కలిపి పాకం తయారుచేసి అందులో ఎసెన్స్ కలిపి ఉంచాలి.

తరువాత బాణలిలో నూనె పోసి కాగాక పిండిని చిన్నసైజు పూరీల్లా మందంగా ఒత్తుకుని రెండువైపులా బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించి తీసి వెంటనే పాకంలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీయాలి. చివరగా వీటిమీద బాదం, పిస్తా పప్పుల్ని ముక్కలుగా చేసి, చల్లి అతిథులకు వడ్డించాలి.

వెబ్దునియా పై చదవండి