మిల్క్‌మెయిడ్ బాసుందీ

కావలసిన పదార్థాలు :
మిల్క్‌మెయిడ్... అర టిన్
పాలు... ఒక లీటర్
పంచదార... పావు కప్పు
చెరోలిపప్పు... ఒక టీ.
బాదంపప్పు... ఒక టీ.
యాలక్కాయలపొడి... అర టీ.

తయారీ విధానం :
పాలను చిక్కగా కోవాలా అయ్యేవరకూ మరిగించాలి. అందులో పంచదార, మిల్క్‌మెయిడ్‌ కలిపి సిమ్‌లో పెట్టి మరో పదిహేను నిమిషాలు మరిగించి దించాలి. బాదం, చెరోలి, యాలకులపొడి వేసి కలిపి చల్లారాక ఫ్రిజ్‌లో పెట్టాలి. అంతే మిల్క్‌మెయిడ్ బాసుందీ సిద్ధమైనట్లే...! చల్లచల్లగా ఉన్న ఈ తియ్యటి వంటకాన్ని పిల్లలూ, పెద్దలూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

వెబ్దునియా పై చదవండి