మిల్క్ గీ ఖీర్

కావలసిన పదార్థాలు :
పాలు... అర లీటరు
సన్న సేమియా... వంద గ్రా.
నెయ్యి... 50గ్రా.
యాలక్కాయల పొడి... అర టీ.
ఖర్జూరం ముక్కలు... రెండు టీ.
జీడిపప్పు... వంద గ్రా.
సారపప్పు... రెండు టీ.
పంచదార... పావు కేజీ

తయారీ విధానం :
బాణలిలో నెయ్యి వేసి సన్న సేమియాను ఎర్రగా వేయించి, తీసి పక్కన ఉంచాలి. మళ్లీ అందులోనే తరిగిన జీడిపప్పు, ఖర్జూరం, సారపప్పుల్ని కూడా వేసి, నేతిలో వేయించి పక్కనపెట్టాలి. పాలను మరిగించి దించేయాలి.

ఇప్పుడు ఇందులో వేయించిన సేమియా, పప్పులూ వేసి పది నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. తరవాత మెల్లిగా కలియబెట్టాలి. సేమియా ఉడికిన తరవాత పంచదార కూడా వేసి, కలిపి వేడి వేడి సర్వ్ చేయాలి. అంతే మిల్క్ గీ ఖీర్ రెడీ అయినట్లే..!

వెబ్దునియా పై చదవండి