మైదాతో రుచికరమైన "పనస తొనలు"

FILE
కావలసిన పదార్థాలు :
మైదాపిండి.. ఒక కప్పు
నెయ్యి.. పావు కప్పు
చక్కెర.. ఒక కప్పు
ఉప్పు.. చిటికెడు
నూనె.. తగినంత

తయారీ విధానం :
ఒక బౌల్‌లో మైదాపిండి, ఉప్పు, నెయ్యి వేసి ముద్దగా కలుపుకోవాలి. కావాలంటే కొద్దిగా నీరు కూడా చేర్చవచ్చు. ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసి పూరీల్లాగా ఒత్తుకోవాలి. చాకుతో ఈ పూరీలను చివరికంటా కోయకుండా నిలువుగా గాట్లు పెట్టాలి. తరువాత వీటిని పనస తొనల్లాగా రోల్ చేసి చివర్లు అతుక్కునేలా వత్తాలి.

ఇప్పుడు వీటిని బాగా కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. చివరగా చక్కెరను తీగపాకం పట్టాలి. ఆ పాకంలో వేయించిన మైదా పనస తొనలను ముంచి వెంటనే తీసి నెయ్యి రాసిన ఓ పళ్లెంలో ఉంచి ఆరబెట్టాలి. పాకం ఆరిపోయిన తరువాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచితే ఇవి వారం రోజులదాకా తాజాగా, కరకరలాడుతూ ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి