కావలసిన పదార్థాలు : పచ్చి శెనగపప్పు.. రెండు కప్పులు పంచదార.. రెండు కప్పులు పాలు... ఒక లీ. నూనె.. కాస్తంత నెయ్యి.. ఒక టీ. జీడిపప్పు పలుకులు... కాసిన్ని ఎండుద్రాక్ష.. కొద్దిగా
తయారీ విధానం : శెనగపప్పును మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేలా ఉడికించాలి. చల్లారాక మిక్సీలో వేయాలి. బాణలిలో నూనె వేడిచేసి ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న శెనగపప్పు మిశ్రమాన్ని వేయించాలి. ఇప్పుడు పాలను సగం అయ్యేదాకా బాగా మరిగించాలి. ఆ తరువాత శెనగపప్పు మిశ్రమం, పంచదార, జీడిపప్పు, ఎండుద్రాక్ష పలుకులు ఒక్కొక్కటిగా వేసి బాగా కలపాలి.
సన్నని మంటపై ఉంచి ఐదు నిమిషాలయ్యాక తీసేస్తే సరిపోతుంది. కొంచెం ఘాటుగా ఉండాలని కోరుకునేవారు ముద్ద కర్పూరం చాలా కొద్దిగా చల్లుకోవచ్చు. ఇది పోషకాల మయం, చేయడం సులువు. మంచిరుచితో ఉండే ఈ హల్వాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.