కావలసిన పదార్థాలు : గట్టి పెరుగు... ముప్పావు లీటర్ పంచదార... పావు కేజీ యాలక్కాయల పొడి... ఒకటిన్నర టీ. సీతాఫలం పండ్లు... నాలుగు పిస్తా పప్పు... 20 గ్రా.
తయారీ విధానం : సీతాఫలాల్లో గింజలు తీసేసి గుజ్జును వేరుచేయాలి. పెరుగుని పలుచటి బట్టలో కట్టి నీళ్లన్నీ వడకట్టాలి. ఇందులో సీతాఫలం గుజ్జు, పంచదార, యాలక్కాయలపొడి అన్నీ వేసి మిక్సీలో రెండుసార్లు తిప్పితే మెత్తగా అవుతుంది. దీన్ని చిన్న చిన్న బౌల్స్‌లో సర్ది ముక్కలుగా కోసిన పిస్తాపప్పుతో అలంకరించి ఓ అరగంటసేపు ఫ్రిజ్‌లో పెడితే చల్ల చల్లని, తియ్యతియ్యని సీతాఫల్ శ్రీకండ్ తయారైనట్లే...!!