అటుకులతో హల్వా... ఎలా చేయాలో తెలుసా..?

మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:11 IST)
కావలసిన పదార్థాలు:
అటుకులు - 4 కప్పులు
పంచదార - 1 కప్పు
నెయ్యి - 1 కప్పు
పాలు - 2 కప్పులు
యాలకుల పొడి - 1 స్పూన్
కుంకుమ పువ్వు - కొద్దిగా 
డ్రైఫ్రూట్స్ - అరకప్పు
మిఠాయి రంగు - అర స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను వేసుకుని వేడయ్యాక అటుకులను దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మరో పాత్రలో పాలు, కుంకుమ పువ్వు వేసి మరిగించుకుని వేగించుకున్న అటుకులు, పంచదార, నెయ్యి వేసి హల్వాలా తయారుచేసుకోవాలి. చివరగా యాలకుల పొడి, వేగించిన డ్రైఫ్రూట్స్, మిఠాయి రంగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే... అటుకులు హల్వా రెడీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు