బ్రెడ్‌తో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం...

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (13:23 IST)
కావలసిన పదార్థాలు:
బ్రెడ్‌ ముక్కలు - 7 
నూనె - 2 స్పూన్స్ 
సోంపు - 1 స్పూన్  
దాల్చిన చెక్క - చిన్న ముక్క 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ 
తరిగిన క్యారెట్‌, క్యాప్సికమ్‌ - 2 కప్పులు 
టమోటాలు - 2 
పచ్చిమిర్చి - 3 
కారం - 2 స్పూన్స్ 
పసుపు - 1 స్పూన్ 
గరం మసాలా - 2 స్పూన్స్ 
ధనియాల పొడి - 1 స్పూన్ 
కొత్తిమీర, పుదీన - 1 కప్పు 
పెరుగు - అర కప్పు 
చక్కెర - 1 స్పూన్ 
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా బ్రెడ్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని పెనం మీద కాల్చుకోవాలి. ఆ తరువాత ఒక బాణలిలో నూనె పోసి వేడయ్యాక దాల్చిన చెక్క, సోంపు వేసి వేయించి తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు పాటు బాగా వేయించి టమోటాలు, ఉప్పు, చక్కెర కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి.

ఆ తరువాత క్యాప్సికమ్‌, క్యారెట్‌, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు వేసి అర గ్లాసు నీళ్లు పోసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించాలి. చివరగా బ్రెడ్‌ ముక్కలు వేసి బాగా కలిపి చిన్నమంట మీద మరో 2 నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే వేడి వేడి బ్రెడ్ బిర్యానీ రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు