కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. కోడిగుడ్డులోని తెల్లసొనను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారులైతే మటన్ కన్నా చికెన్, చేపల్ని ఎక్కువగా తీసుకోవచ్చు. చేపల్లో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి మేలు చేయడమే కాదు, కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తాయి.