క్యారెట్ కేక్ ఎలా చేయాలో తెలుసా...?

బుధవారం, 19 డిశెంబరు 2018 (11:23 IST)
కావలసిన పదార్థాలు:
క్యారెట్ తురుము - 200 గ్రా
మైదా - 125 గ్రా
బేకింగ్ పౌడర్ - 1 స్పూన్
బేకింగ్ సోడా - అరస్పూన్
ఉప్పు - పావుస్పూన్
యాలకులు, దాల్చినచెక్క పొడి - అరస్పూన్
పంచదార - 200 గ్రా
గుడ్లు - 2
జీడిపప్పు తరుగు - 50 గ్రా
నూనె - 100 గ్రా.
 
తయారీ విధానం:
ముందుగా ఓవెన్‍ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ప్రీహిట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బేకిండ్ ట్రే.. లోపలి భాగమంతా నూనె రాసి మైదా పొడి చల్లి పక్కన పెట్టుకోవాలి. మరో వెడల్పాటి లోతైన గిన్నెలో గుడ్లు గిలగొట్టి నూనె, మైదై, బేకింగ్ పౌడర్, సోడా, ఉప్పు, పంచదార, యాలకుల, దాల్చినచెక్క పొడి, జీడిపప్పు ముక్కలు, క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలో వేసి 25 నుండి 30 నిమిషాల పాటు ఓవెన్‌లో ఉంచి.. తీసేయాలి. అంతే... హెల్దీ క్యారెట్ కేక్ రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు