కాజు బర్ఫీ తయారీ విధానం..?

గురువారం, 25 ఏప్రియల్ 2019 (11:18 IST)
కావలసిన పదార్థాలు:
కాజు - వందగ్రాములు
చక్కెర - 6 లేదా 7 స్పూన్స్
యాలకుల పొడ - కొద్దిగా
కుంకుమ పువ్వు - కొద్దిగా
నీళ్ళు - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా జీడిపప్పును మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకుని చక్కెర మునిగేంత వరకు నీరుపేసి తీగపాకం కన్నా కొద్దిగా ఎక్కువ పాకం వచ్చే వరకూ వేడిచేయాలి. తరువాత అందులో కుంకుమ పువ్వు వేసుకోవాలి. పాకం తయారవుతుండగా యాలకుల పొడి, జీడిపప్పు పొడి వేసి సన్నని మంటమీద గట్టిపడేంత వరకు కలియబెడుతూ ఉండాలి. జీడిపప్పు విశ్రమం గట్టిపడగానే దింపేసుకోవాలి. ఇప్పుడి మందపాటి ప్లేటు తీసుకుని దానికి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో పరిచినట్టు పోసుకుని కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి. అంతే అందరూ ఎంతో ఇష్టపడే కాజు బర్ఫీ రెడీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు