ముందుగా సగ్గుబియ్యాన్ని బాణలిలో సన్నని మంటమీద వేయించుకోవాలి. అలాగే కొబ్బరి పొడిని కూడా కొద్దిగా వేయించాలి. ఇప్పుడు నెయ్యి వేడిచేసి అందులో జీడిపప్పు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత సగ్గుబియ్యాన్ని పొడిగా చేసుకుని అందులో పచ్చికొబ్బరి, జీడిపప్పు, యాలకుల పొడి కొద్దిగా నెయ్యి కలిపి లడ్డూల్లా చేసుకోవాలి. పొడిపొడిగా ఉండి లడ్డూలు చేసేందుకు వీలు కాకపోతే అందులో కొద్ది పాలు కలుపుకుంటే చాలు.. అంతే... సగ్గుబియ్యం లడ్డూలు రెడీ.