కావలసిన పదార్థాలు : గోధుమపిండి... అర కేజీ మైదా... అర కేజీ గోధుమ నూక... పావు కేజీ పచ్చికొబ్బరిముక్కలు... రెండు కప్పులు కాచిన పాలు... అర లీ. యాలకుల పొడి... ఒక టీ. వంట సోడా... అర టీ. నూనె... సరిపడా
తయారీ విధానం : గోధుమపిండి, మైదాలను కలిపి అందులోనే గోధుమ నూక, యాలకులపొడి, పంచదార, కొబ్బరిముక్కలు, తినే సోడా వేసి పాలు పోసి పునుగుల పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి గరిటెతో లేదా చేత్తోనే పిండి తీసుకుని కావలసిన సైజులో నూనెలో వెయ్యాలి. అవి పొంగి ఎర్రగా వేగిన తరువాత చిల్లులగరిటెతో తీయాలి. ఉత్తరాదివారి స్పెషల్ అయిన ఈ పాలపువ్వులు నాలుగురోజుల దాకా నిల్వ ఉంటాయి.