కావలసిన పదార్థాలు : ఖర్జూరాలు... పావు కేజీ పంచదార... వంద గ్రా. మంచినీళ్లు... అర గ్లాసు కాటేజ్ ఛీజ్.... వంద గ్రా. చిరోంజి పప్పు... పది గ్రా. జీడిపప్పు... 25 గ్రా. మీగడ... నాలుగు టీ. చెర్రీపండ్లు... రెండు
తయారీ విధానం : ఖర్జూరాల్ని నీళ్లలో ఓ రోజంతా నానబెట్టాలి. ఓ వెడల్పాటి పాన్‌లో పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. కాస్త చిక్కబడిన తరువాత... చిరోంజి పప్పు, జీడిపప్పు, నానబెట్టి గింజలు తీసేసిన ఖర్జూరాలు వేసి 15 నిమిషాలపాటు ఉడికించాలి.
తరువాత ముక్కలుగా కోసిన కాటేజ్ ఛీజ్ వేసి బాగా కలిపి దించి మీగడ, చెర్రీ పండ్లతో అలంకరించాలి. అంతే వేడి వేడి ఖర్జూరం ఛీజ్ స్పెషల్ స్వీట్ రెడీ అయినట్లే...! చాలా మంచి పోషకాహారమైన దీన్ని చిన్నారులు చాలా ఇష్టంగా తింటారు కూడా...!!