గసగసాలతో హల్వా

గురువారం, 26 ఫిబ్రవరి 2009 (18:23 IST)
కావలసిన పదార్థాలు :
గసగసాలు... ఒక కప్పు
పంచదార... ఒకటిన్నర కప్పు
నెయ్యి... ఒక కప్పు

తయారీ విధానం :
గసగసాలను రాళ్లు లేకుండా శుభ్రం చేసి.. నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. తరువాత గసగసాలను ఒక పాత్రలో వేసి మునిగేంతదాకా నీరుపోసి ఒక గంటసేపు నానబెట్టాలి. తరువాత నీటిని వంపేసి గసగసాలను మెత్తగా రుబ్బి ముద్ద చేసుకోవాలి.

ఇప్పుడు పొయ్యిమీద ఒక గిన్నె పెట్టి, పంచదారను వేసి కాసిన్ని నీళ్ళు పోసి తీగపాకం వచ్చేవరకు కలియబెట్టాలి. ఆ తర్వాత రుబ్బి ఉంచుకున్న గసగసాల ముద్దను అందులో వేసి కలియబెట్టాలి. అందులో నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ కలియబెట్టాలి. మిశ్రమం గట్టిపడుతుందనంగా కిందకు దించేయాలి. అంతే గసగసాల హల్వా రెడీ అయినట్లే..!

ఇది నాలుగు రోజులపాటు నిల్వ ఉంటుంది. అవసరం అనుకునేవారు జీడిపప్పులను నేతిలో వేయించి హల్వా గట్టిపడుతున్న క్రమంలో వేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి