చాక్లెట్ ఇలాచీ మిల్క్‌షేక్

కావలసిన పదార్థాలు :
చిక్కటి మీగడపాలు... పావు లీటర్
ఫైవ్‌స్టార్ చాక్లెట్స్... 25 గ్రా.
పంచదార పొడి... ఐదు టీ.
యాలక్కాయల పొడి... పావు టీ.
ఐస్ ముక్కలు... మూడు

తయారీ విధానం :
ఫైవ్‌స్టార్ చాక్లెట్లను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, మిక్సీ జార్‌లో వేసి.. అందులో పాలు, ఐసు ముక్కలు, యాలక్కాయలపొడి వేసి నురగ వచ్చేదాకా బాగా గ్రైండ్ చేయాలి. నురగ ఆరిపోకముందే గాజు గ్లాసుల్లోకి వంపి చల్లచల్లగా సర్వ్ చేయాలి. అంతే చాక్లెట్ ఇలాచీ మిల్క్‌షేక్ రెడీ అయినట్లే..! ఓ పట్టు పట్టేద్దామా..!!

వెబ్దునియా పై చదవండి