డ్రైఫ్రూట్‌ బిస్కెట్స్‌

కావలసిన పదార్థాలు :
మైదా పిండి... అర కేజీ
డాల్డా... 150 గ్రా.
పంచదారపొడి... 200 గ్రా.
కోడిగుడ్లు... రెండు
బాదంపప్పులు... వంద గ్రా.
టూటీఫ్రూటీలు... వంద గ్రా.
వెనిల్లా ఎసెన్స్... ఒక టీ.
బేకింగ్ పౌడర్... ఒక టీ.

తయారీ విధానం :
డాల్డాలో పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాలి. కోడిగుడ్డుసొనలో వెనిల్లా ఎసెన్స్‌ వేసి బాగా కలపాలి. ఓ గిన్నెలో మైదా పిండి, చిన్నచిన్న ముక్కలుగా కోసిన బాదంపప్పు, టూటీఫ్రూటీలు, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోనే పంచదార కలిపిన వనస్పతి, కోడిగుడ్డు సొనలు కూడా వేసి బాగా కలిపి పిండిముద్దలా చేసి 10 నిమిషాలు కదపకుండా అలాగే పక్కన ఉంచాలి.

పిండిని ముద్దలుగా విడదీసి రెండు చపాతీల మందాన చేసి డైమండ్‌ లేదా చతురస్రాకారంలో ముక్కలుగా కోయాలి. ఓ వెడల్పాటి ట్రేలో అడుగున వెన్న రాసి దానిపైన కొద్ది మైదా పిండి పలుచగా చల్లి, కోసిన ఈ ముక్కల్ని అందులో సర్ది, ఓవెన్‌లో 350 డిగ్రీల ఫారన్‌హీట్‌ డిగ్రీల వద్ద 15 నిమిషాలపాటు బేక్‌ చేసి తీయాలి. చల్లారాక డబ్బాలో సర్దితే 15 రోజులు నిల్వ ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి