కావాల్సిన పదార్థాలు: మూడుంపావు కప్పుల పాలు, ఆరు క్యారెట్లు, ఆరేడు యాలకులు, మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఐదు టేబుల్ స్పూన్ల పంచదార, రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్, నాలుగు టేబుల్ స్పూన్ల బాదం పప్పులు.
తయారుచేసే పద్ధతి: మందంగా ఉండే పాన్ లో పాలను మరగబెట్టాలి. క్యారెట్ తురుము, యాలకుల పొడులను వేసి కలియబెట్టాలి. సన్నని సెగపై ముప్పై నుంచి నలభై నిమిషాలపాటు ఉడికించాలి.
నీరంతా తీసేశాక నెయ్యి, పచదార, కిస్మిస్, బాదంపప్పుల పలుకులు వేసి మరో 5 నిమిషాలపాటు ఉడకనివ్వాలి. చల్లగా లేదా వేడిగా ఎవరిష్టానుసారం వారు తినవచ్చు. రుచితోపాటు పోషకాలు పుష్కలంగా ఉంటాయి.