కావలసిన పదార్థాలు : బూడిద గుమ్మడికాయ... ఒక కేజీ పంచదార... 300 గ్రా. యాలకుల పొడి... 20 గ్రా. జీడిపప్పు... వంద గ్రా. నెయ్యి... 200 గ్రా. గుల్‌కండ్... వంద గ్రా. ఖర్జూరాలు... వంద గ్రా. తేనె... వంద మి.లీ.
తయారీ విధానం : గుమ్మడికాయ తురుమును జల్లెడమూకుడు (చిల్లుల ప్లేటు)లో వేసి అందులోని నీళ్లన్నీ పోయేవరకూ ఉంచాలి. నెయ్యి వేడిచేసి జీడిపప్పు వేయించాలి. అందులోనే గుమ్మడికాయ తురుము వేసి బాగా ఉడికించాలి. తరవాత పంచదార వేసి పాకం అంతా ఇగిరిపోయేవరకూ ఉడికించాలి.
తరిగిన ఎండు ఖర్జూరాలు, గుల్‌కండ్ (పంచదార ద్రావణంలో నానబెట్టిన గులాబీ రేకులు), తేనె వేసి హల్వాలా చిక్కబడేవరకూ ఉడికించి దించేయాలి. చివరగా యాలకుల పొడి వేసి కలిపి, పైన గులాబీరేకులు చల్లితే నోరూరించే పచ్చిగుమ్మడి గుల్‌కండ్ రెడీ..!