కావలసిన పదార్థాలు : బీట్రూట్ తురుము... ఒక కప్పు రాగిపిండి... అర కప్పు సేమ్యా... పావు కప్పు సగ్గుబియ్యం... పావు కప్పు పంచదార... ఒక కప్పు కొబ్బరితురుము... అర కప్పు కాచినపాలు... అర లీ. వేయించిన జీడిపప్పులు... పది బాదం... పది కిస్మిస్... పది యాలకుల పొడి... పావు టీ. నెయ్యి... రెండు టీ. నీళ్లు... రెండు కప్పులు
తయారీ విధానం : సేమ్యాను, సగ్గు బియ్యాన్ని విడివిడిగా దోరగా వేయించాలి. దళసరి అడుగున్న వెడల్పాటి పాత్రలో నీళ్లు పోసి అవి మరిగాక సేమ్యా, సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. ఈలోపు తురిమిన బీట్రూట్ను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి రాగిపిండిని జతచేసి కొద్దిగా నీరుపోసి ఉండలు లేకుండా చూసి, ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసి అడుగంటకుండా తిప్పి పంచదార వేసి కలపాలి.
పాయసం చిక్కబడ్డాక యాలకులపొడి, వేయించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్లు వేసి దించేయాలి. పాయసం వేడి తగ్గి గది ఉష్ణోగ్రతకు వచ్చాక కాచి చల్లార్చిన పాలను అందులో కలిపి సర్వ్ చేయాలి. చూసేందుకు పింక్ కలర్లో అందంగా కనిపించే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. మంచి రక్తపుష్టిని కూడా కలిగిస్తుంది.