పూరీలు మిగిలిపోయాయని ఫీలవకండేం...!!

కావలసిన పదార్థాలు :
పూరీల పొడి... 3 గ్లాసులు
పంచదార పొడి... 6 గ్లాసులు
పుట్నాలపొడి... గ్లాసు
కరిగించిన నెయ్యి... గ్లాసు
జీడిపప్పు... 100గ్రా
యాలకుల పొడి... 2 టీస్పూన్లు
పచ్చకర్పూరం పొడి... పావుటీస్పూను

తయారీ విధానం :
అరెరే.. పూరీలు అవసరానికి మించి ఎక్కువ చేసేశామే.. ఇప్పుడెలా అంటూ బాధపడుతూ కూర్చోకుండా, ఇలా ప్రొసీడ్ అయిపోండి మరి.. మిగిలిపోయిన పూరీలను మరోసారి నూనె బాగా కరకరలాడేలా వేయించి పక్కన పెట్టుకోండి. వాటిని మెత్తగా పొడి చేసి, అందులో పుట్నాలపొడి, పంచదార పొడి, యాలకుల పొడి, పచ్చకర్పూరం పొడులను ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. దాంట్లో నెయ్యి వేస్తూ బాగా ముద్దగా కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా చుట్టి జీడిపప్పును అద్దితే వెరైటీ పూరీ లడ్డూలు సిద్ధమైనట్లే...!

వెబ్దునియా పై చదవండి