కావలసిన పదార్థాలు : సొరకాయ... ఒకటి పాలు... ఒక లీటర్ బియ్యంపిండి... ఒక కప్పు పంచదార... రెండు కప్పులు యాలక్కాయలపొడి... రెండు టీ. బాదం పప్పులు... అర కప్పు
తయారీ విధానం : సొరకాయ తొక్కు తీసి సన్నగా తురిమి ఉంచాలి. తురుము మునిగేదాకా నీటిని పోసి పది నిమిషాలపాటు ఉంచాలి. తరువాత మరికొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. అందులోనే పాలు, పంచదార కూడా వేసి కలుపుతూ కాసేపు ఉడకబెట్టాలి.
సొరకాయ తురుము బాగా ఉడికిన తరువాత, అందులో బియ్యంపిండి వేసి గడ్డలు కట్టకుండా తిప్పుతూ మరో పది నిమిషాలపాటు ఉడికించాలి. చివర్లో యాలక్కాయల పొడి వేసి కలిపి, చల్లారిన తరువాత కాసేపు ఫ్రిజ్లో ఉంచాలి. తరువాత బయటకు తీసి సర్వింగ్ కప్స్లలో పోసి, కట్ చేసిన బాదం పప్పులతో పైన అలంకరించి అతిథులకు చల్లచల్లగా సర్వ్ చేయండి.