బూడిద గుమ్మడితో రుచికరమైన "పేటా"

కావలసిన పదార్థాలు :
బూడిదగుమ్మడి... ఒక కేజీ
పంచదార... 800 గ్రా.
నిమ్మరసం... ఒక టీ.
పటిక... అర టీ.
మంచినీరు... రెండు కప్పులు

తయారీ విధానం :
బూడిదగుమ్మడి తొక్క తీసి చతురస్రాకారంలో అంగుళం సైజులో ముక్కలుగా కోసుకోవాలి. ప్రతిముక్కకూ అన్నివైపులా చిల్లులు పెట్టాలి. వీటిపై నిమ్మరసం పోసి బాగా కలిపి అరగంటసేపు నానబెట్టాలి. తరువాత ఈ ముక్కల్ని బాగా కడగాలి. పటిక కలిపిన నీళ్లను ముక్కలమీద చల్లి రెండుమూడు నిమిషాలు ఉంచి, ఆ నీటిని వంచేసి ముక్కల్ని ఆరబెట్టాలి.

ఓ పెద్ద బాణలి తీసుకుని పొయ్యిమీద పెట్టి పంచదార, నీళ్లు కలిపి మరిగించాలి. లేత పాకం రాగానే మంట తగ్గించి బూడిదగుమ్మడి ముక్కలు వేయాలి. పాకం బాగా చిక్కబడేవరకూ సుమారు పదీ పదిహేను నిమిషాలు అలాగే ఉడికించాలి. ఆపై పాకం బాగా చల్లబడేవరకూ కదపకుండా ఉంచి చల్లారిన తరువాత పంచదార పాకాన్ని మరో పాత్రలోకి వంపేయాలి.

ఆ ముక్కల్ని అలాగే ఓ రాత్రంతా ఉంచాలి. మరునాడు వంచి ఉంచిన పాకాన్ని ఈ ముక్కలకు పట్టించి మళ్లీ మరిగించాలి. ఆ పాకాన్ని తిరిగీ వంచేసి, చల్లార్చాలి. అంతే రుచికరమైన బూడిదగుమ్మడి పేటా తయారైనట్లే... ఓ పట్టు పట్టేద్దామా...?!

వెబ్దునియా పై చదవండి