కావలసిన పదార్థాలు : గోధుమ రవ్వ... అర కేజీ బియ్యం పిండి... కప్పు పొట్టు పెసరపప్పు... పావు కేజీ బెల్లం తురుము... అర కేజీ పచ్చిపాలు... పావు కేజీ కొబ్బరికాయ... ఒకటి నెయ్యి... వంద గ్రా. యాలకుల పొడి... ఒక టీ. మంచినీళ్లు... తగినన్ని
తయారీ విధానం : పెసరపప్పుని పొడి చేసి ఉంచాలి, కొబ్బరి తురమాలి. గోధుమరవ్వలో పెసరపప్పు పొడి, బియ్యంపిండి, బెల్లం తురుము, పాలు, కొబ్బరి తురుము, నెయ్యి, యాలకులపొడి వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుని గట్టి ముద్దలాగా చేయాలి. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి, ఒక్కో ముద్దను అరచేతిలో పెట్టి నాలుగువేళ్లతో కోలగా ఒత్తాలి. ఇప్పుడు వీటిని కుక్కర్‌లో 20 నిమిషాలపాటు ఆవిరిమీద ఉడికించి తీయాలి. అంతే బొజ్జగణపయ్యల్లాంటి మన చిన్నారుల కోసం తీపి కుడుములు సిద్ధమయినట్లే..!