కావలసిన పదార్థాలు : మామిడికాయ తురుము.. ఒక కప్పు క్యారెట్ తురుము.. రెండు కప్పులు బీట్రూట్ తురుము.. అర కప్పు పచ్చికోవా.. రెండు కప్పులు మైదా.. ఆరు కప్పులు నెయ్యి.. రెండు కప్పులు పంచదార.. నాలుగు కప్పులు యాలకులపొడి.. రెండు టీ. ఉప్పు.. తగినంత నూనె.. సరిపడా
తయారీ విధానం : మైదా పిండిలో ఉప్పు, ఆరు టీస్పూన్ల పంచదార, కాసిన్ని పాలు చేర్చి చపాతీ పిండికంటే కాస్త పల్చగా కలిపి గంటసేపు నానబెట్టాలి. బాణలిలో నాలుగు టీస్పూన్ల నెయ్యి వేడిచేసి బీట్రూట్, క్యారెట్ తురుములను పచ్చివాసన పోయేదాకా వేయించాలి. దాంట్లోనే మామిడి తురుము కూడా చేర్చి మరికాసేపు వేయించాలి. పదినిమిషాలయ్యాక అందులో పంచదార, అరకప్పు నీటిని పోసి బాగా ఉడికించాలి. మిశ్రమం బాగా ఉడికి ముద్దగా అయిన తరువాత పచ్చికోవా, యాలకుల పొడి చేర్చి కలియబెట్టి స్టౌ ఆపి దించేయాలి.
ఇప్పుడు మైదా పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒక్కో ఉండను పాలిథిన్ కవర్‌పై నూనె అద్దుతూ చేత్తో చిన్న పూరీల్లా వత్తాలి. అందులో మామిడి మిశ్రమాన్ని ఉంచి, చుట్టూ పిండితో మూసివేసి, మళ్లీ నూనె అద్దుతూ బొబ్బట్లు మాదిరిగా వత్తాలి. అలా మొత్తం పిండినంతా చేసుకుని, పెనంపై తగినంత నెయ్యి వేస్తూ దోరగా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి మామిడి బొబ్బట్లు తయార్. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా, వెరైటీగా ఉంటాయి.