మామిడిపండ్లతో "హల్వా" చేయవచ్చా...?!

కావలసిన పదార్థాలు :
మామిడిపండ్లు... నాలుగు
చక్కెర... అర కేజీ
నెయ్యి... ఆరు టీ.
జీడిపప్పు పలుకులు... గుప్పెడు
యాలకుల పొడి... ఒక టీ.

తయారీ విధానం :
మామిడిపండ్లను మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. ఆ తరువాత జ్యూస్‌ను వడగట్టి, గుజ్జును తీసి విడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ మందపాటి బాణలిలో నెయ్యి, మామిడిపండు గుజ్జు, చక్కెర వేసి అడుగంటకుండా కలుపుతూ ఇరవై నిమిషాలపాటు ఉడికించాలి.

అలా ఉడుకుతున్న మిశ్రమం చేతికి అంటకుండా ఉండేలాగా అయ్యేంతదాకా ఉంచి, అందులో నెయ్యితో వేయించిన జీడిపప్పు ముక్కలు, యాలకుల పొడిని కలపాలి. తరువాత పాత్రను స్టవ్‌పై నుంచి కిందికి దించివేసి, బాగా ఆరబెట్టి సర్వ్ చేయాలి. అంతే తియ్యతియ్యగా వెరైటీగా ఉండే మామిడిపండ్ల హల్వా సిద్ధమైనట్లే...!

వెబ్దునియా పై చదవండి