మినప్పప్పు తీపి వడలు

కావలసిన పదార్థాలు :
మినప్పప్పు... పావు కేజీ
పంచదార... 200 గ్రా.
ముడి బియ్యం... రెండు టీ.
నూనె... డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం :
మినప్పప్పులో బియ్యం వేసి కడిగి ఓ గంటసేపు నానబెట్టాలి. పప్పులో నీళ్లు వంపేసి మెత్తగా రుబ్బాలి. ఇందులోనే పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిముద్దను చిన్న చిన్న వడలుగా వత్తి నూనెలో తక్కువ సెగమీద వేయించి తీయాలి. తక్కువ మంటపై వేయించినట్లయితే, వడల లోపలి బాగా ఉడుకుతుంది. ఇవి డీప్ ఫ్రై అయ్యాక బయటికి తీసి, జీడిపప్పును గుచ్చి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి