కావలసిన పదార్థాలు : సెనగపప్పు... అర కేజీ యాలక్కాయలు... పది వరిపిండి.... పావు కప్పు పంచదార... ఒక కప్పు నెయ్యి... పావు కేజీ
తయారీ విధానం : సెనగపప్పును ఉడికించి, నీళ్లు వంపేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. దీనికి వరిపిండి చేర్చి, అందులోనే యాలక్కాయలపొడి, పంచదార కూడా వేసి కలపాలి. పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని గారెల్లాగా వత్తి, కాగుతున్న నేతిలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. చివర్లో ఈ గారెలపైన పంచదార చల్లితే సెనగపప్పు తీపి వడలు సిద్ధమైనట్లే..!