కావలసిన పదార్థాలు : మైదాపిండి... ఒక కేజీ నెయ్యి... వంద గ్రా. ఉప్పు... పావు టీ. పంచదార... ఒకటింపావు కేజీ మిఠాయిరంగు... అర టీ. నూనె... సరిపడా
తయారీ విధానం : మైదాను శుభ్రంచేసి జల్లించాలి. అందులోనే ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. దీనికి కొంచెం నీటిలో మిఠాయి రంగు కలిపి ఆ నీటిని కలిపి ముద్దగా కలపాలి. ఈ ముద్దను 20 చిన్న ఉండలుగా చేసి ఒక్కో ముద్దను పూరీల్లాగ ఒత్తాలి. ఈ పూరీని అంచుల వరకూ కాకుండా చాకుతో మధ్యలో రిబ్బను పట్టీల్లా కోయాలి.
తరువాత పూరీ రెండు చివరలను దగ్గరకు మడిచి నూనెలో దోరగా వేయించి తీయాలి. మందపాటి గిన్నెలో పంచదార, గ్లాసున్నర నీళ్లు పోసి లేతపాకం రానివ్వాలి. వేయించిన గౌజాలమీద ఈ పాకంపోసి అట్లకాడతో విరిగిపోకుండా కలపాలి. అంతే తియ్యతియ్యని మైదా గౌజాలు రెడీ అయినట్లే...!!