హాయిగా గొంతులోకి జారే పసందైన వంటకం

కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... 200గ్రా
మైదా... 50గ్రా
నీళ్లు... ఒక లీ.
రిఫైండ్‌ ఆయిల్... తగినంత
ఉప్పు... చిటికెడు
పంచదార పొడి... 400గ్రా.చిక్కటిపాలు... అర లీ.
పిక్కాకోవా... 100గ్రా
జీడిపప్పు... 50గ్రా
నెయ్యి... 50గ్రా
వెనీలా ఎసెన్స్‌... అర టీ.
యాలకులపొడి... పావు టీ.

తయారీ విధానం :
గోధుమ, మైదా, కలిపి జల్లెడ పట్టాలి. అందులో ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ముద్దలా కలిపి కొద్దిసేపు నాననివ్వాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చిన్న చిన్న పూరీలుగా వత్తి నూనెలో దోరరంగులో వేయించి తీయాలి. కార్న్‌ఫ్లోర్‌, కోవా, జీడిపప్పు పేస్టు, యాలకులపొడి అన్నింటినీ తగినన్ని నీళ్లతో జారుగా కలిపి ఉంచాలి.

వెడల్పాటి పాత్రలో నీళ్లు పోసి మరిగించి పంచదార పొడి వేసి కరిగించాలి. అందులో కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం పోస్తూ స్పీడ్‌గా కలపాలి. చిక్కగా గుజ్జులా తయారయ్యాక గిన్నె దించి అందులో పాలు పోయాలి. గోరువెచ్చగా ఉన్న ఈ మిశ్రమంలో పూరీలు వేసి రెండుగంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి. సుతి మెత్తగా గొంతులోకి జారిపోయే రుచికరమైన పాలమడుగుల్ని పిల్లలు ఇష్టంగా తింటారు.

వెబ్దునియా పై చదవండి