హోలీ స్పెషల్ పురాన్ పొలి తయారీ విధానం!

FILE
హోలీ పండుగకు ఆహార తయారీ చాలా రోజుల ముందు నుండే ప్రారంభిస్తారు, హోలీ పండుగ సమయాన వచ్చిన అతిథులకు గుజియా అప్పడాలు, కంజి మరియు మల్పాస్, మథిరి, పురాన్ పొలి, దాహి బదాస్ వంటి వివిధ రకాలైన ఫలహరాలను వడ్డిస్తారు. ఇందులో పురాన్ పొలి తయారీ విధానం ఏమిటో చూద్దాం..

కావలసిన పదార్థాలు:
మినప్పప్పు: 300 గ్రాములు
బెల్లం: 300 గ్రాములు
బియ్యం పండి: 150 గ్రాములు
నెయ్యి: ఒక టేబుల్ స్పూన్.

తయారీ విధానం:
ముందుగా మినపప్పును బాగా మెత్తగా ఉడికించుకుని పక్కనబెట్టుకోవాలి. పది నిమిషాలు ఉడికిన పప్పును ఆరబెట్టి తర్వాత మెత్తని పొడిలా కొట్టుకోవాలి. ఈ పిండిలో బెల్లంను వేసి సరిపడా నీటితో బాగా కలుపుకోవాలి. బెల్లం, పిండి మిశ్రమంలో నెయ్యి, బియ్యం పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని పూరీల్లా రుద్దుకుని పక్కన బెట్టుకోవాలి. ఆ పూరీలను పాన్‌లో ఇరువైపులా నెయ్యితో దోరగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి