తొలి స్వైన్‌ఫ్లూ కేసు నమోదు చేసుకున్న నైజీరియా

గురువారం, 5 నవంబరు 2009 (15:30 IST)
నైజీరియాలో అమెరికాకు చెందిన ఓ తొమ్మిది సంవత్సరాల బాలికకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకింది. దీంతో నైజీరియాలో తొలి స్వైన్‌‌ఫ్లూ కేసు నమోదైంది ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిన బాలిక లాగోస్‌లో నివసిస్తోందని, ప్రస్తుతం ఆ అమ్మాయి హెచ్1ఎన్1 వైరస్‌ నుంచి కోలుకుంటోందని నైజీరియా ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్. బాబా తుండే ఓసోటిమేహిన్ వెల్లడించారు.

స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిన వెంటనే ఆ అమ్మాయికి తాము తగిన వైద్య సేవలను అందించామని, దీంతోపాటు తాము ఆ అమ్మాయి చదువుతున్న పాఠశాలలోని విద్యార్థులకు, ఆమె సోదరుడు, తండ్రి తదితరులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని ఆయన వివరించారు.

వీరిలో ఎవ్వరికీ ఈ వ్యాధి లక్షణాలు కనపడలేదని. అయినప్పటికీ తాము అప్రమత్తమైనామని, ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రతి వ్యక్తికి తాము తగు జాగ్రత్తలు సూచిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు తమ దేశంలో ఈ కేసు తప్ప మరోటి నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా తమ దేశంలో హెచ్1ఎన్1 వ్యాధి నిరోధక మాత్రలైన టామీఫ్లూ మాత్రలు దేశంలోని ప్రతి ఆసుపత్రిలోను, మందుల దుకాణాల్లో అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి