వయసు పైబడిన వారికి స్వైన్‌ఫ్లూ సోకితే ప్రమాదమే...

బుధవారం, 4 నవంబరు 2009 (13:40 IST)
FILE
50 సంవత్సరాలకు పైబడిన వారికి స్వైన్‌ఫ్లూ మహమ్మారి సోకితే ప్రమాదమేనని, ఇది వారి మృత్యువుకు దారి తీస్తుందని అమెరికా పరిశోధకులు తెలిపారు.

హెచ్1ఎన్1 వైరస్ ప్రస్తుతం యువకుల్లో అధికంగా ఉందని, ఇది వయసు పైబడిన వారికి సంక్రమిస్తే అత్యంత ప్రమాదకరమని, ఇది వారి మృత్యువుకు దారితీస్తుందని కాలిఫోర్నియాకు చెందిన ఆరోగ్య సంస్థ పరిశోధకులు పేర్కొన్నారు.

గత 17 ఏప్రిల్ నుంచి 22 ఆగస్టు మధ్యలో స్వైన్‌ఫ్లూ వ్యాధిబారిన పడి 1,088 మంది వివిధ ఆసుపత్రులలో చేరి వైద్యసేవలు అందుకున్నారని, వారిలో 11 శాతం ప్రజలు చనిపోయారని కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు వివరించారు.

అదే చిన్న పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తే పలు జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన వైద్యసేవలు వారికి అందించాలని పరిశోధకులు కోరారు. పిల్లల్లో, పెద్దవారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఈ వ్యాధి త్వరగా అంటుకుంటుందని, దీంతో వారు జాగ్రత్తలు తీసుకోవాల్సివుంటుందని వారు సూచించారు.
FILE


స్వైన్‌ఫ్లూ బారినపడి 1,088 మంది చికిత్స తీసుకుంటుండగా వారిలో 11 శాతం మృత్యువాత పడ్డారు. చనిపోయిన 11 శాతం మందిలో అత్యధికులు 50 సంవత్సరాలపైబడినవారేనని వారు వివరించారు.

స్వైన్‌ఫ్లూ వ్యాధి వ్యాపించిన తొలి 16 వారాల్లో 18 సంవత్సరాలలోపువారే చనిపోయారని, వీరి శాతం 7గా నమోదైందని పరిశోధకులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి