స్వైన్ ఫ్లూ నివారణకు దేశీయ తాళింపులు

శుక్రవారం, 8 జనవరి 2010 (19:56 IST)
స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు ఇండియన్ కర్రీ వాడితే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు రష్యాకు చెందిన వైద్య నిపుణులు. మసాలాతో కూడుకున్న తాళింపులు ఆహారంగా సేవిస్తే జలుబు, దగ్గు, తుమ్ములు, స్వైన్ ఫ్లూలాంటి వ్యాధులు దరిచేరవని, అల్లోపతి మందులు తీసుకుంటే ఏ మాత్రం ప్రభావం చూపిస్తాయో అలాంటి ప్రభావమే ఉంటుందంటున్నారు వైద్యులు.

మసాలాతో కూడుకున్న వేపుడు పదార్థాలు, తాళింపులు సేవిస్తుంటే అందులోనున్న పసుపు, అల్లం, లవంగాలు, జిలకర తదితర పదార్థాల కారణంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మాస్కో సిటీకి చెందిన సెనేటరీ అండ్ యాంటీ-ఎపిడోమిక్స్ కమిటీకి చెందిన అధికారి ఆర్ఐఏ నోవోస్తీ తెలిపారు. ఇలాంటి ఆహార పదార్థాలు సేవిస్తుంటే జలుబు, స్వైన్ ఫ్లూ మటుమాయమౌతుందని తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు ఆయన తెలిపారు.

తాళింపుల్లో వాడే మిరియాలు, వెల్లుల్లి, కరివేపాకులలో ఔషదీయ గుణాలున్నాయని, వీటిని సేవిస్తుంటే జలుబు, స్వైన్ ఫ్లూ మటుమాయమంటున్నారు రష్యాకు చెందిన పరిశోధకులు. అలాగే పెరుగులో కరివేపాకును తాళింపుగా చేసుకుని సేవిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు పరిశోధకులు.

వెబ్దునియా పై చదవండి